Home న్యూస్ ఫైటర్ ఔట్…ఇప్పుడు బాలీవుడ్ No1 ‘కల్కి’!!

ఫైటర్ ఔట్…ఇప్పుడు బాలీవుడ్ No1 ‘కల్కి’!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా అద్బుతమైన వసూళ్ళతో దుమ్ము లేపగా ఇతర భాషల్లో పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేక పోవడంతో ఎంతవరకు జోరు చూపిస్తుందో అని అనుకున్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ తో…

అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా హిందీలో ప్రమోషన్స్ ఏమి లేకుండానే ప్రభాస్ స్టార్ పవర్ ను చూపెడుతూ ఆల్ రెడీ 200 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో రికార్డ్ ను కూడా నమోదు చేసింది…

ఈ ఏడాది బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్టాఫ్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కొన్ని ఉండగా వాటిలో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ఫైటర్(Fighter Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఓవరాల్ గా రన్ కంప్లీట్ అయ్యే టైం కి 215 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్స్ బాలీవుడ్ తరుపున ఫస్టాఫ్ లో హైయెస్ట్ గా నిలిచాయి. కానీ ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని కేవలం 12 రోజుల కలెక్షన్స్ తో రెబల్ స్టార్ కల్కి మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తూ 250 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా….

2024 ఇయర్ కి గాను బాలీవుడ్ తరుపున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీ గా ఇప్పుడు రికార్డ్ కొట్టింది కల్కి మూవీ. మినిమమ్ కలెక్షన్స్ వచ్చినా గొప్పే అని రిలీజ్ కి ముందు అనుకున్న స్టేజ్ నుండి ఇప్పుడు ఏకంగా ఈ ఇయర్ కే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని బాలీవుడ్ లో నమోదు చేసే స్టేజ్ కి…

వచ్చిన రెబల్ స్టార్ కల్కి సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ని అలానే కొనసాగితే లాంగ్ రన్ లో 275 కోట్లు ఆ పైన నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి అంతకుమించి కూడా సినిమా జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here