ఎలక్షన్స్ ఫీవర్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది…జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఘన విజయం నమోదు చేసింది….ప్రభుత్వం మళ్ళీ పాతదే వస్తే కొత్త సినిమాలకు టికెట్ హైక్స్ కోసం కష్టాలు తప్పవు అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా స్ప్రెడ్ అవ్వగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో ఇండస్ట్రీ వ్యక్తులే ప్రభుత్వంలో ఉండటంతో…
పెద్ద సినిమాలకు ఇక పండగే అని చెప్పాలి….ఇలాంటి టైంలో ఇప్పుడు ఇండియా వైడ్ గా భారీ ఎత్తున కొంత గ్యాప్ తర్వాత భారీ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…
నిర్మాత అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్ట్ గా నిలవడం ఇప్పుడు వాళ్ళే గెలవడంతో టాలీవుడ్ నుండి ఎలక్షన్స్ తర్వాత బిగ్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా కల్కినే అవ్వడంతో మునుపటిలా ఆంధ్రలో స్పెషల్ షోలు, మిడ్ నైట్ షోలు, టికెట్ హైక్స్ లాంటి అనేక అడ్వాంటేజ్ లు అన్ని సినిమాలకు కలిసి రాబోతుంది…
ఇక ప్రభాస్ కల్కి మూవీకి ఈ అడ్వాంటేజ్ ముందుకు కలిసి రాబోతూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమాకి అనుకున్న రేంజ్ లో టాక్ కూడా వస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఊహకందని వసూళ్ళతో ఊచకోత కోయడం ఖాయం…