Home న్యూస్ కల్కి ట్రైలర్ లో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్….మేకర్స్ ఇవి చూసుకోలేదా!!

కల్కి ట్రైలర్ లో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్….మేకర్స్ ఇవి చూసుకోలేదా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా మెయిన్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో విజువల్స్, టేకింగ్ మరియు గ్రాండియర్ ఓ రేంజ్ లో ఆకట్టుకునేలా ఉండగా సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది అని చెప్పాలి…

ఎలివేషన్ లు, ప్రభాస్ లుక్ అమితాబ్ రోల్, కమల్ హాసన్ మైండ్ బ్లోయింగ్ లుక్ లు ట్రైలర్ లో మేజర్ హైలెట్ గా నిలిచాయి. కానీ ట్రైలర్ లో అందరికీ మైనస్ గా అనిపించినా ఒకే ఒక్క పాయింట్ మాత్రం ప్రభాస్ కాకుండా బాలీవుడ్ యాక్టర్స్ ల డబ్బింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా దీపికా పదుకునే తెలుగు డబ్బింగ్ తీవ్రంగా నిరాశ పరచగా…

కల్కి లో ప్రభాస్ తో 2 క్రేజీ హీరోల స్పెషల్ రోల్స్…వాళ్ళు ఎవరంటే!
అమితాబ్ డబ్బింగ్ ఓకే అనిపించగా దిశా పటానీ డబ్బింగ్ అసలు లిప్ సింక్ కూడా లేకుండా పోయింది. మేజర్ గా సోషల్ మీడియాలో ట్రైలర్ లో వీళ్ళ డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదని, ఇది మేజర్ మైనస్ లా అనిపించింది అంటూ చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్ వీళ్ళ డబ్బింగ్ విషయంలో ఒరిజినల్ వాయిస్ కాకుండా…

మిగిలిన సినిమాలకు చేసినట్లు ఇతర డబ్బింగ్ యాక్టర్స్ తోనే డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు…సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఫైనల్ ఔట్ మీద మరింత శ్రద్ధ తీసుకుని ఒరిజినల్ వాయిస్ తోనే వెళ్ళాలి అనుకుంటే మిస్టేక్స్ ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…

కర్ణాటక గడ్డ మీద ప్రభాస్ రచ్చ…కల్కి కి ఎంత బిజినెస్ ఆఫర్ వచ్చిందో తెలుసా!
ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద అంచనాలను బాగానే పెంచినా కూడా ఇవి మాత్రం మేజర్ మైనస్ పాయింట్స్ లా అనిపించింది ఎక్కువ మందికి… ఇక సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ సాలిడ్ గా ఉండటంతో రిలీజ్ టైంకి ఈ బజ్ మరింతగా పెరిగి రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here