బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కి దూరం అయిన చాలా మంది హీరోలలో ఒకరైన మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమాతో మంచి కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా సినిమాలో అన్ని ఇండస్ట్రీ ల నుండి క్రేజీ యాక్టర్స్ స్పెషల్ రోల్స్ చేయడంతో సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది..
అన్నింటికీ మించి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) స్పెషల్ రోల్ చేస్తూ ఉండటంతో ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా ఈ సినిమా మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో..
ఎప్పటి కప్పుడు ఎదో ఒక కారణం వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా ఈ నెల 25న సినిమా రిలీజ్ ఉంటుందని ముందు అనుకున్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో డిలే అవుతూ ఉండటంతో సినిమా రిలీజ్ ను మరోసారి పోస్ట్ పోన్ చేయగా లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ను..
కన్ఫాం చేశారు….ఆ డేట్ నార్మల్ గా అనిపించినా కూడా లాస్ట్ ఇయర్ అదే డేట్ కి వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1060 కోట్ల వసూళ్ళతో సంచలనం సృష్టించింది. ఆ డేటే జూన్ 27న…లాస్ట్ ఇయర్ అదే డేట్ కి ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అయ్యి…
ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది…కాగా ఇప్పుడు కన్నప్పలో కూడా ప్రభాస్ స్పెషల్ రోల్ లోనే అయినా కూడా ఉండటం ఆ రోల్ బాగా పవర్ ఫుల్ గా సుమారు 30 నిమిషాల రేంజ్ లో లెంత్ తో ఉంటుందని చెబుతూ ఉండటంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే…
మరీ కల్కి రేంజ్ లో రిజల్ట్ రిపీట్ కాకపోయినా కూడా ఓవరాల్ గా అందులో సగం వరకు వసూళ్లు వచ్చినా అది ఊచకోత అనే చెప్పొచ్చు. మరి కల్కి రేంజ్ లో ఇందులో కూడా స్టార్ కాస్ట్ ఉండటంతో ఆ డేట్ కే వస్తున్న కన్నప్ప ఎంతవరకు కల్కి మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయగలుగుతుందో చూడాలి ఇక…