బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం కన్నడ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా కాంతార… రిశబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నా ఆ అంచనాలను మించిపోయే రేంజ్ లో సినిమా కన్నడలో టాక్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మొదటి వారానికి మించి రెండో వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయగా ఇతర భాషల డబ్బింగ్ వర్షన్ కూడా రెడీగా ఉన్నప్పటికీ ఇతర భాషల్లో సినిమాల వలన డబ్బింగ్ వర్షన్ ని హోల్డ్ చేయగా ఈ లోపు సినిమా టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో సినిమా పై…
ఇతర ఇండస్ట్రీలలో కూడా అంచనాలు పెరిగి పోగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15న గ్రాండ్ గానే రిలీజ్ అవ్వగా సినిమా ని ఉన్నంతలో మంచి థియేటర్స్ లో బాగానే రిలీజ్ చేస్తున్నారు, సినిమా నైజాంలో మొత్తం మీద 115 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సీడెడ్ లో 50 థియేటర్స్ లో…
రిలీజ్ అవ్వగా ఆంధ్ర ఏరియా మొత్తం మీద 140 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా 305 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ వాళ్ళు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా ఓవరాల్ వర్త్ బిజినెస్ రేంజ్ 2 కోట్లకు పైగా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా… దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో…
హిట్ అవ్వాలి అంటే 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది, ఇక సినిమా కన్నడ వర్షన్ 2 వారాలలో వరల్డ్ వైడ్ గా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఊహించిన దానికి మించి వసూళ్ళ ప్రవాహం కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు ఇతర భాషల్లో కూడా జోరు చూపిస్తే 120 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.