Home న్యూస్ కార్తీ మాస్: ఖైదీ 2 డేస్ తెలుగు కలెక్షన్స్…తక్కువ థియేటర్స్ లో భీభత్సం!!

కార్తీ మాస్: ఖైదీ 2 డేస్ తెలుగు కలెక్షన్స్…తక్కువ థియేటర్స్ లో భీభత్సం!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర పోటిలో కమర్షియల్ మూవీ విజిల్ ఉండగా రిలీజ్ కి ముందు వరకు, రిలీజ్ రోజు వరకు కూడా ఎలాంటి అంచనాలు లేని కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ రిలీజ్ అయిన మొదటి షో కే ఎక్స్ లెంట్ టాక్ ని సొంతం చేసుకుంది, తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా సినిమా కి ఓ రేంజ్ లో ఇంప్రెస్ అవ్వగా సినిమా అల్టిమేట్ మౌత్ టాక్ తో దూసుకు పోతుంది.

సినిమా థియేటర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉండటం తో కలెక్షన్స్ మరీ గొప్పగా కనిపించక పోయినా ఓవరాల్ గా సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే కచ్చితంగా లాంగ్ రన్ లో దుమ్ము లేపే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొదటి రోజు 62 లక్షల షేర్ ని అందుకున్న సినిమా…

రెండో రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందీ అనుకున్నా గ్రోత్ సాలిడ్ గా చూపించి సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 68 లక్షల షేర్ ని అందుకుంది, దాంతో టోటల్ గా 2 రోజులకు గాను తెలుగు లో సినిమా 1.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

ఇక ఈ రోజు రేపు సినిమా మరింత జోరు చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు. సినిమా లో మాస్ ఆడియన్స్ కి అల్టిమేట్ గూస్ బంప్స్ తెప్పించే కొన్ని సీన్స్ ఉండటం తో రిపీట్ ఆడియన్స్ కూడా సినిమా కి ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 5 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సాధించిన 1.3 కోట్లు కాకుండా మరో 3.7 కోట్ల షేర్ ని సినిమా అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది, లాంగ్ రన్ లో ఈ మార్క్ ని అందుకునే అన్ని అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here