బెల్లంకొండ శ్రీనివాస్ బాక్స్ ఆఫీస్ కష్టాలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ళు గా నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ నటించిన లేటెస్ట్ మూవీ కవచం బాక్స్ ఆఫీస్ దగ్గర పోయిన వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడం అప్పటికే రిలీజ్ అయిన 2.0 జోరు ఇంకా కొనసాగుతుండటం తో మొదటి వీకెండ్ లో టోటల్ గా 3.5 కోట్ల లోపు షేర్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా.
ఇక సినిమా వర్కింగ్ డే టెస్ట్ అయిన 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపలేక 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు డ్రాప్స్ ఏకంగా 70% వరకు ఉండటంతో ఏమాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేసింది ఈ సినిమా. దాంతో సినిమా 4 వ రోజు కలెక్షన్స్…
20 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇది చావుదెబ్బ అనే చెప్పాలి. 19 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి సినిమా మరో 15.5 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక అది అసాధ్యమే అని చెప్పుచ్చు. ఏదైనా అద్బుతం జరిగే తప్ప ఆ అవకాశం లేదనే చెప్పాలి.