Home న్యూస్ కన్నడ గడ్డపై 100 కోట్లు…చరిత్ర చిరిగిపోయింది!

కన్నడ గడ్డపై 100 కోట్లు…చరిత్ర చిరిగిపోయింది!

0

  మన రాష్ట్రాలతో పోల్చితే పక్క రాష్ట్రం కర్ణాటక సినిమాల మార్కెట్ చాలా తక్కువ… కానీ అలాంటి చోట కూడా మన బాహుబలి సృష్టించిన భీభాత్సాలు అన్ని ఇన్ని కావు. పరాయి భాష సినిమా నే అయినా కానీ బాహుబలి అక్కడ ఏకంగా టోటల్ రన్ లో 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని చరిత్ర సృష్టించింది. కానీ ఆ సినిమా దరిదాపుల్లో కూడా మరే కన్నడ స్ట్రైట్ మూవీ కర్ణాటక లో కలెక్షన్స్ ని అందుకోలేదు…

ఈ అపవాదు ని చెరిపేస్తూ ఇప్పుడు కన్నడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన KGF బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ ఏరియా కి గాను ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ ను అందుకుని ఈ మార్క్ అందుకున్న తొలి స్ట్రైట్…

కన్నడ సినిమా గా నిలవగా ఓవరాల్ గా బాహుబలి తర్వాత రెండో సినిమా గా నిలిచి సంచలన రికార్డ్ ను అందుకుంది. ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా సాగుతున్న సినిమా కలెక్షన్స్ ని చూస్తుంటే లాంగ్ రన్ లో 120 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here