Home న్యూస్ బాలీవుడ్ గడ్డపై టాప్ 4..ఊచకోత అంటే ఇదే!!

బాలీవుడ్ గడ్డపై టాప్ 4..ఊచకోత అంటే ఇదే!!

0

కన్నడ సెన్సేషనల్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత ని కొనసాగిస్తూ దూసుకు పోతుంది. సినిమా ఇప్పటికే అనేక రికార్డుల బెండు తీయగా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సరికొత్త రికార్డులతో సౌత్ ఇండస్ట్రీ సత్తా చూపుతూ సరికొత్త రికార్డులను అక్కడ కూడా నమోదు చేసి సంచలనం సృష్టించింది, హిందీ లో డబ్ అయిన మూవీస్ లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది ఈ సినిమా.

మొదటి ప్లేస్ లో బాహుబలి 2 ఎవ్వరి అందనంత ఎత్తులో 511 కోట్ల నెట్ కలెక్షన్స్ తో హిందీ ఇండస్ట్రీ హిట్ గా ఉండగా రెండో ప్లేస్ లో రోబో 2.0 197 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తో టాప్ 2 లో ఉంది. ఇక మూడో ప్లేస్ లో బాహుబలి పార్ట్ 1 111 కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ 3 లో ఉండగా…

4 వ ప్లేస్ లో ఉన్న కబాలి 32 కోట్ల నెట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసిన KGF సినిమా 33 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ టైం టాప్ 4 డబ్బింగ్ మూవీ ఇన్ బాలీవుడ్ గా నిలిచి సరికొత్త సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here