కన్నడ మూవీస్ మార్కెట్ చాలా చిన్నది…ఆ స్టేట్ లో తప్పితే మిగిలిన ఏరియాల్లో కలెక్షన్స్ రావడం చాలా అరుదు.. అందుకే అక్కడ సినిమాలు పెద్దగా మార్కెట్ ఎక్స్ పాన్షన్ కి కూడా ట్రై చేయలేదు, కానీ మొదటి సారిగా మార్కెట్ ఎక్స్ పాన్షన్ ని ప్లాన్ చేసిన సినిమా KGF… బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ తో పాటు తెలుగు, తమిళ్ మరియు హిందీ లో రిలీజ్ అయ్యి 5 రోజుల్లోనే 95 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది.
దాంతో సినిమా అల్టిమేట్ రికార్డులలో కన్నడ ఇండస్ట్రీ తరుపున హైయెస్ట్ గ్రాస్ అండ్ షేర్ వసూల్ చేసిన సినిమా గా కేవలం 5 రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. న్యూ ఇండస్ట్రీ హిట్ ఆఫ్ కర్ణాటక గా నిలిచి దుమ్ము లేపింది.
ఈ క్రమం లో సినిమా కన్నడ టాప్ మూవీస్ రాజకుమారా 76 కోట్లు, ది విలన్ 72 కోట్ల గ్రాస్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇది యష్ కెరీర్ లో రెండో ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోవాలి. ఇది వరకు మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి మొదటి ఇండస్ట్రీ హిట్ గా 40 కోట్లకు పైగా గ్రాస్ తో చరిత్ర సృష్టించింది.