Home న్యూస్ KGF@110 కోట్లు…ఏం కొట్టుడు సామి ఇది!!

KGF@110 కోట్లు…ఏం కొట్టుడు సామి ఇది!!

0

  కర్ణాటక న్యూ ఇండస్ట్రీ హిట్ గా మారిన KGF బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం ఆపడం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో ఏకంగా 95.5 కోట్ల గ్రాస్ ని అందుకుని కర్ణాటక న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సత్తా చూపిన ఈ సినిమా 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అన్ని చోట్లా జోరు చూపుతూ దూసుకు పోయింది. సినిమా అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసింది.

దాంతో ఫైనల్ లెక్కలు తేలాల్సి ఉన్నా మొత్తం మీద సినిమా 6 వ రోజు కలెక్షన్స్ తో ఏకంగా 110 కోట్ల రేంజ్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు సమాచారం. ఇది నిజంగానే ఊహకందని ఊచకోత అని చెప్పాలి. ఇక సెకెండ్ వీక్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే…

సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 200 కోట్ల రేంజ్ గ్రాస్ ని కూడా అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క 100 కోట్ల గ్రాస్ మూవీ కూడా లేని కర్ణాటక ఇండస్ట్రీ ఇప్పుడు ఏకంగా 200 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here