Home న్యూస్ 600 కోట్ల హీరో సినిమా….బిజినెస్…బుకింగ్స్ రిపోర్ట్…మైండ్ బ్లాంక్!

600 కోట్ల హీరో సినిమా….బిజినెస్…బుకింగ్స్ రిపోర్ట్…మైండ్ బ్లాంక్!

0

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) చాలా టైం కి జైలర్(Jailer Movie) తో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోశాడు. అలాంటి హీరో తర్వాత సినిమా సోలోగా కాకున్నా కూడా తన కూతురు డైరెక్షన్ లో స్పెషల్ క్యామియో అవ్వడంతో…

లాల్ సలామ్(Lal Salaam Movie) మీద అంచనాలు ఏర్పడ్డాయి కానీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రావడంతో బజ్ తగ్గగా ఇప్పుడు శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమాను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు, తమిళ్ లో కూడా సినిమా బుకింగ్స్ చాలా నీరసంగా ఉన్నాయి. 

ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ రజినీ పేరు మీద 35 కోట్ల దాకా చేశారని టాక్ అయితే ఉంది, రజినీని స్పెషల్ క్యామియో అవ్వడం, జైలర్ తర్వాత రజినీ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు అయితే ఉన్నాయి కానీ సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియాలో…

2.5 కోట్లు మాత్రమె గ్రాస్ బుకింగ్ జరగగా వరల్డ్ వైడ్ 3.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ మాత్రమె జరిగాయి, రజినీ సినిమాకి ఇలాంటి బుకింగ్స్ అందరికీ శాకిస్తున్నా సినిమా జానర్ దృశ్యా మౌత్ టాక్ చాలా ముఖ్యమని చెప్పొచ్చు. సినిమా వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 70 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది.

తెలుగు లో రవితేజ(Raviteja) ఈగిల్(Eagle Movie) పోటి లో ఉండటంతో ఇక్కడ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం తక్కువే, అద్బుతమైన పాజిటివ్ టాక్ వస్తేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా మ్యాజిక్ చూపించే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here