హిట్ల కోసం ఎదురు చూపులు అన్ని ఇండస్ట్రీ లలో ఉంటాయి, టాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ రాజ్యం ఏలే ఇండస్ట్రీ అని పేరున్నా రీసెంట్ టైం లో కమర్షియల్ మూవీస్ కూడా హిట్ గీత ని దాటలేక పోతున్న విషయం తెలిసిందే, టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ గత 4 నెలల్లో రిలీజ్ అయిన అన్ని సినిమాలను చూసుకుంటే ఒక్కటంటే ఒక్కటి మాత్రమె నికార్సయిన హిట్ గా నిలిచిన సినిమా ఉందని చెప్పాలి.
నవంబర్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో చివరి హిట్ విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా కాగా తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. అమర్ అక్బర్ ఆంథోనీ, సవ్యసాచి, ఇదం జగత్, అంతరిక్షం, పడి పడి లేచే మనసు..
సుబ్రమణ్యపురం, కవచం, నెక్స్ట్ ఏంటి ఇలా అనేక ఎంతో కొంత క్రేజ్ ఉన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బాడగా మధ్యలో హుషారు అనే చిన్న సినిమా కొద్దిగా కలెక్షన్స్ ని అందుకున్నా అది పూర్తీ సంతృప్తి ని ఇవ్వలేదు, ఇక 2019 ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు…
ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, మిస్టర్ మజ్ను, యాత్ర ఇలా అన్ని సినిమాలు నిరాశనే మిగిలించాయి. మధ్యలో వచ్చిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మాత్రమె ప్రేక్షకుల మనసుని గెల్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాగా నిలిచింది.
ఇక ఇదే సినిమా ప్రస్తుతానికి 2019 మొదటి హిట్ గా నిలవగా చివరి 4 నెలల్లో ఒకే ఒక్క క్లీన్ హిట్ నిలిచింది. ఇక మీదట రిలీజ్ అయ్యే సినిమాలు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుందాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.