బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో సెకెండ్ వేవ్ తర్వాత ఆల్ ఇండియా లెవల్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న సినిమా లవ్ స్టొరీ… బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అనుకున్న రేంజ్ టాక్ ఏమి రాక పోయినా కానీ పరిస్థితులు అనుకూలించక పోయినా లాంగ్ రన్ లో 35 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో మరో….
హిట్ మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది, సమ్మర్ కి అనుకున్న టైం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ అయ్యి ఉంటే సినిమా కచ్చితంగా సంచలనాలను సృష్టించి ఉండేది కానీ అలా జరలేదు… అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని…
ఆల్ మోస్ట్ 30 రోజుల వరకు సొంతం చేసుకుని పరుగును ముగించింది. సినిమా తెలుగులో పరుగు ను ముగించిన తర్వాత రీసెంట్ గా కేరళలో థియేటర్స్ రీ ఓపెన్ అవ్వడంతో అక్కడ రిలీజ్ కి లోకల్ మూవీస్ సిద్ధంగా లేక పోవడంతో తమిళ్ మరియు తెలుగు నుండి డాక్టర్ మరియు లవ్ స్టొరీ సినిమాలను…
డబ్ చేసి రిలీజ్ చేశారు… లవ్ స్టొరీ సినిమా సుమారు గా 49 స్క్రీన్స్ లో అక్కడ రిలీజ్ ను సొంతం చేసుకోగా థియేటర్స్ కి వచ్చిన చూసిన ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ నే సొంతం చేసుకుందట సినిమా. ఇక అక్కడ మొత్తం మీద వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన తర్వాత 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
ఓవరాల్ గా 8-10 లక్షల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు… అందులో షేర్ 4-5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది, ఉన్న థియేటర్స్ లో ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. అక్కడ లాంగ్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఇంకా ఎంత వరకు లవ్ స్టొరీ కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి ఇక.