టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడి పల్లి ల కాంబినేషన్ లో ముగ్గురు నిర్మాతల కంబైండ్ నిర్మాణం లో భారీ అంచ నాల నడుమ తెరకెక్కుతున్న సినిమా మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కు తున్న ఈ సినిమా సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండ గా సినిమా అఫీషియల్ టీసర్ అతి త్వరలో నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమా చారం.
కాగా ఇక బిజినెస్ పరంగా సినిమా అన్ని ఏరియాల్లో దుమ్ము లేపే రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుందట. కాగా ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మహర్షి సినిమా ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రతిష్టాత్మక…
100 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమా ని నైజాం మరియు వైజాగ్ లలో ఓన్ గా రిలీజ్ చేస్తున్నా కానీ టోటల్ వర్త్ బిజినెస్ అంతా కలిపి 100 కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.
ఇక సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కింద 15 కోట్ల నుండి 20 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ 20 కోట్ల లోపు, మిగిలిన మ్యూజిక్ అండ్ డిజిటల్ హక్కులు ఇలా అన్నీ కలిపి సినిమా నిర్మాతలకు ఏకంగా 140 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.
మహేష్ గత సినిమాల్లో శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను సినిమాలు మాత్రమె విజయాలు గా నిలిచినప్పటికీ ప్రతీ సినిమా బిజినెస్ విషయం లో మాత్రం సూపర్ స్టార్ తన రేంజ్ చూపెడుతూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇక మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.