Home న్యూస్ ఇదే ఫైనల్….మహర్షి ఫైనల్ టాక్ ఇదే ఇక!!

ఇదే ఫైనల్….మహర్షి ఫైనల్ టాక్ ఇదే ఇక!!

0

     కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు, కాగా ముందుగా ఓవర్సీస్ లో భారీ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడ నుండి డీసెంట్ టాక్ లభించగా తర్వాత రెగ్యులర్ షోలకి సినిమాకి కూడా మంచి టాక్ లభించింది, కానీ ఇందులో ఎక్కువ శాతం ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో వచ్చే ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి…

ఇప్పుడు అసలు సిసలు టాక్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని బాగానే ఇష్టపడుతున్నారు అని చెప్పాలి, ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయని, మహేష్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని, కానీ లెంత్ ఎక్కువ అయిందని వారు చెబుతున్నారు.

వారి నుండి ఫైనల్ టాక్ కూడా హిట్ రేంజ్ లో ఉందని చెప్పాలి, ఇక కామన్ ఆడియన్స్ మాత్రం సినిమాలో నెగిటివ్స్ ని వెతుకుతూ లెంత్ ఎక్కువ అయిందని, స్లో నరేషన్ బోర్ కొట్టించని, పాటలు ఆకట్టుకోలేదని అంటున్నారు, కానీ స్టొరీ పాయింట్ బాగుండటం… ఫస్టాఫ్ కాలేజ్ ఎపిసోడ్ మొత్తం అలాగే సినిమాలో వచ్చే ఫైట్ సీన్స్…

అద్బుతంగా ఉండటం సినిమాకి ప్లస్ పాయింట్స్ అని, ముందు చెప్పిన మైనస్ లను ఈ సీన్స్ కోసం బరించవచ్చు అని అంటున్నారు. ఫైనల్ టాక్ ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. మొత్తం మీద మహర్షి సినిమా ఓవర్సీస్ లో హిట్ టాక్ తో మొదలు అయ్యి…

ఓవరాల్ గా రోజు ముగిసే సరికి కూడా ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో నే ఉందని చెప్పాలి, ఓపెన్ గ్రౌండ్ 2  – 3 వారాలు ఉంటుంది కాబట్టి సూపర్ స్టార్ కి ఈ టాక్ సరిపోతుందని చెప్పొచ్చు, ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న గా చెప్పుకోవచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here