Home న్యూస్ తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన విశ్వాసం TRP రేటింగ్!!

తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన విశ్వాసం TRP రేటింగ్!!

0

  కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం తమిళనాట ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే, సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రీసెంట్ గా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన ఈ సినిమా TRP రేటింగ్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో దక్కినట్లు సమాచారం, కోలివుడ్ ఇండస్ట్రీ లో ఈ రేంజ్ లో TRP రేటింగ్ రావడం ఇది రెండో సారి అంటున్నారు.

కాగా బార్క్ వచ్చే సమయం లో వచ్చిన బిచ్చగాడు సినిమా TRP రేటింగ్ పరంగా సౌత్ లో ఏకంగా 24.5 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని రికార్డుల కెక్కింది, కాగా ఇప్పుడు ఈ రికార్డ్ ను విశ్వాసం సినిమా బ్రేక్ చేసిందని చెబుతున్నారు. ఓవరాల్ గా 25 TRP రేటింగ్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం.

ఇది సౌత్ లో బార్క్ వచ్చిన తర్వాత ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. ఓవరాల్ గా రేటింగ్ పాయింట్స్ చూసుకుంటే #Viswasam – 18143, #Pichaikkaran – 17696 గా ఉంది, సౌత్ లో ఈ రెండు సినిమా TRP రేటింగ్ బార్క్ వచ్చిన తర్వాత ఆల్ టైం రికార్డ్ గా చెప్పుకోవచ్చు. విశ్వాసం సినిమా ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here