డిఫెరెంట్ జానర్ మూవీస్ తో ఆడియన్స్ ను సినిమా సినిమాకి ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న అడివి శేష్ ఈ సారి డిఫెరెంట్ జానర్ లో కాకుండా రిలీజ్ లైఫ్ స్టొరీ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 26/11 ముంబై దాడుల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టొరీగా ఆడియన్స్ ముందుకు రానుంది….
సందీప్ ఉన్నికృష్ణన్ గారు ముంబై అటాక్స్ లో చనిపోయారు అని అందరికీ తెలుసు కానీ ఆయన బ్యాక్ స్టొరీ గురించి తక్కువ మందికే తెలుసు… 26/11 అటాక్స్ పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇలా ఒక పెర్సన్ లైఫ్ స్టొరీ నుండి అటాక్స్ జరిగే క్రమంలో…
ఎలా ఆ అటాక్స్ ని ఎదురుకున్నాడు, ఇంతకీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బ్యాక్ స్టొరీ ఏంటి అన్న విషయాలు అన్నీ మేజర్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ట్రైలర్ ప్రతీ సీన్ ఎక్స్ లెంట్ గా ఆకట్టుకోగా ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ ఎక్స్ లెంట్ గా సెట్ అయ్యాడు అని చెప్పాలి…
ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్స్ కానీ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ ని తెప్పించింది…. యు మే టేక్ మీ బట్ నాట్ మై కంట్రీ అంటూ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి అని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను భారీగా పెంచేయగా ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించే సత్తా ఉన్నా సినిమాగా….
ఈ ట్రైలర్ మెప్పించింది అని చెప్పాలి. ఎప్పటిలానే అడివి శేష్ మరోసారి తన స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. జూన్ 3న భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా మరో పాన్ ఇండియా రిలీజ్ గా రాబోతుండగా సినిమా కచ్చితంగా మరో పాన్ ఇండియన్ సక్సెస్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉండనిపించేలా ఉందని చెప్పాలి.