బాహుబలి ని చూసి ఇన్స్పైర్ అయ్యి అన్ని ఇండస్ట్రీ ల నుండి భారీ బడ్జెట్ మూవీస్ వస్తుండగా కేరళ నుండి కూడా భారీ బడ్జెట్ తో రూపొందించిన లేటెస్ట్ మూవీ మామంగం వచ్చింది, పెర్ఫెక్ట్ బడ్జెట్ ఎంత అనేది తెలియలేదు కానీ ఈ సినిమా కోసం 60 నుండి 80 కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారని టాక్ ఉంది. అన్ని భాషల్లో కుమ్మేస్తుంది అన్న నమ్మకంతో ఆ రేంజ్ లో బడ్జెట్ పెట్టారట.
కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని తెచ్చుకోగా ఏ దశ లో కూడా కలెక్షన్స్ ని అందుకునే దిశగా అడుగులు వేయడం లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.
సినిమా కేరళలో 12.7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.6 కోట్లు, ఓవర్సీస్ లో 8.8 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా టోటల్ గా కలెక్షన్స్ 23.1 కోటి దాకా వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెల్చేశాయి. అందులో షేర్ 12 కోట్ల లోపే ఉంటుందని అంచనా. ఇక 5 వ రోజు వర్కింగ్ డే అవ్వడం టోటల్ గా సినిమా….
మరి 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని మాత్రమె కలెక్ట్ చేసిందట. తమిళ్ తెలుగు లో సినిమా పూర్తిగా వైట్ వాష్ అయ్యిందని అంటున్నారు. తెలుగు లో 5 రోజుల్లో మొత్తం మీద 20 లక్షల లోపు షేర్ ని మాత్రమె వసూల్ చేసి కొన్న వాళ్లకి భారీ షాక్ ని ఇచ్చింది, కానీ మరో పక్క నిర్మాతలు మాత్రమ్….
సినిమా మొత్తం మీద వీకెండ్ లోనే 62 కోట్లు వసూల్ చేసిందని, త్వరలోనే 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందని చెబుతున్నారట. ట్రేడ్ లెక్క నిర్మాతల లెక్క మధ్య తేడా భారీ గా ఉండటం తో నిర్మాతలు పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద కేరళ బాహుబలి అంటూ తెగ ప్రచారం చేసినా భారీ డిసాస్టర్ అవ్వబోతుంది ఈ సినిమా…