బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొంత టైంగా పూర్తిగా స్లో అయిన వేల రీసెంట్ గా మళ్ళీ రీ రిలీజ్ ల ట్రెండ్ జోరు అందుకుంటూ ఉండగా వరుస పెట్టి ఓల్డ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు….రీసెంట్ గా మురారి మరియు ఇంద్ర సినిమాలు మహేష్ బాబు మరియు చిరంజీవి పుట్టిన రోజు కానుకగా…
రీ రిలీజ్ అయ్యి అద్బుతమైన సక్సెస్ లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున పుట్టిన రోజు కానుకగా కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మాస్ మూవీ(Mass4K Re Release Collections) సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు కానీ…
అది ఆచరణలో అనుకున్న రేంజ్ లో పెట్టలేక పోయారు. దాంతో లిమిటెడ్ షోలనే సొంతం చేసుకున్న మాస్ మూవీ రీ రిలీజ్ లిమిటెడ్ సెంటర్స్ కే పరిమితం అవ్వడంతో కలెక్షన్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో జోరుని అయితే చూపించ లేక పోయింది అని చెప్పాలి.
మొత్తం మీద నైజాంలో 6 లక్షల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల రేంజ్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో గ్రాస్ బుకింగ్స్ నమోదు అవ్వగా టోటల్ ఇండియాలో 14 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న మాస్ మూవీ ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 17-18 లక్షల రేంజ్ లో గ్రాస్ ను…
టోటల్ ఇండియాలో 22 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా సొంతం చేసుకుంది. దాంతో రీసెంట్ రీ రిలీజ్ ల జోరుతో కంపేర్ చేస్తే మాస్ మూవీ రీ రిలీజ్ కి ఏమాత్రం ఆశించిన రెస్పాన్స్ అయితే సొంతం అవ్వలేక పోయింది.. ఇక అప్ కమింగ్ రీ రిలీజ్ లు ఎలా ట్రెండ్ అవుతాయో చూడాలి.