మీడియం రేంజ్ హీరోల మీద భారీ బడ్జెట్ రీసెంట్ టైంలో చాలా రిస్కీ గా మారింది….చాలా మంది హీరోలు అసలు ఫామ్ లోనే లేరు….చిన్న సినిమాలు అయినా హిట్ అవుతున్నాయి కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలు యునానిమస్ హిట్ టాక్ రాకుండా యావరేజ్ టాక్ వచ్చినా కూడా జనాలు మినిమమ్ పట్టించు కోవడం లేదు…
అయినా కూడా వాళ్ళు రెమ్యునరేషన్ ని తగ్గించుకోవడం లేదు, నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం తగ్గించడం లేదు…నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరుగుతుంది అన్న కారణంగా నిర్మాతలు సినిమాల బడ్జెట్ ఓవర్ ది బోర్డ్ వెళ్ళినా రికవరీ అవుతుంది..
అన్న నమ్మకంతో ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు…రీసెంట్ గా ఇలా ఎక్కువ బడ్జెట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉండగా లేటెస్ట్ గా హిట్ కోసం చాలా టైంగా ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ…
మట్కా(Matka Movie Budget) సినిమా మొదటి ఆటకే ఆడియన్స్ నుండి డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా బడ్జెట్ లో 10% కలెక్షన్స్ ని కూడా వీకెండ్ లో అందుకునే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు. ఈ సినిమా కోసం మేకర్స్ ఆల్ మోస్ట్ 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సమాచారం…
ఇక పబ్లిసిటీ ఖర్చులు కూడా బాగానే జరగగా ప్రింట్స్ అండ్ అన్ని ఖర్చులు కలిపి 45 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మాణం అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందులో పట్టుమని 10% రికవరీ అయిన 4.5 కోట్ల ను కూడా అందుకోలేని పరిస్థితి నెలకొంది ఇప్పుడు…
సినిమా టోటల్ రన్ లో సైతం 10% రికవరీ ని అందుకునే అవకాశం లేదు అంటే ఏ రేంజ్ లో కలెక్షన్స్ పై దెబ్బ పడిందో అర్ధం చేసుకోవచ్చు. నాన్ థియేట్రికల్ బిజినెస్ తో కొంచం మంచి రికవరీ అయింది అంటున్న కూడా ఓవరాల్ గా బడ్జెట్ దృశ్యా సినిమా అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.