Home న్యూస్ మట్టి కుస్తీ రివ్యూ…రేటింగ్!

మట్టి కుస్తీ రివ్యూ…రేటింగ్!

0

ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం ఒక స్ట్రైట్ మూవీతో పాటు ఒక డబ్బింగ్ మూవీ కూడా వచ్చింది. తెలుగు లో అరణ్య మరియు FIR మూవీస్ తో ఆల్ రెడీ ఆడియన్స్ ను పలకరించిన విష్ణు విశాల్ ఇప్పుడు లేటెస్ట్ గా మట్టి కుస్తీ అంటూ మరో సినిమాతో వచ్చేశాడు. తెలుగు లో రవితేజ ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో కొద్దిగా బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా సినిమా స్టొరీ పాయింట్ కి వస్తే…. హీరో తన కన్నా తక్కువ చదువుకుని జడ పొడవుగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు… అలాంటి టైం లో హీరోయిన్ తో పెళ్లి జరగగా తర్వాత హీరోయిన్ ఒక ఫైటర్ అని తెలుస్తుంది… అలాగే తను హీరో కన్నా ఎక్కువ చదువుకుంది అని తెలుస్తుంది. ఈ ట్విస్ట్ తర్వాత ఏం జరిగింది, కుస్తీ పోటి కథ ఏంటి లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ ఓవరాల్ పాయింట్ చాలా సింపుల్ గా ఉండగా సినిమా కూడా అలానే ఉంటుంది, కానీ ఎంటర్ టైన్ మెంట్ పరంగా మాత్రం సినిమా చాలా వరకు ఆడియన్స్ ని నవ్వించే క్రమంలో సఫలం అయింది అని చెప్పాలి. కథలో హీరో ఉన్నా కానీ మేజర్ రోల్ మాత్రం హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీదే అని చెప్పాలి. విష్ణు విశాల్ తానె నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ ఇవ్వడం మెచ్చుకోవాల్సిన అంశం. 

ఫస్టాఫ్ వరకు కామెడీ ఎలిమెంట్స్ తో సరదాగా సాగగా ఇంటర్వెల్ టైం కి అనుకున్నట్లు నిజం బయట పడుతుంది, ఇక సెకెండ్ ఆఫ్ లో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుందేమో అనుకుంటాం కానీ డైరెక్టర్ అక్కడ కూడా చాలా వరకు ఎంటర్ టైన్ మెంట్ తోనే సినిమాను కొనసాగించాడు, ఇక చివర్లో మట్టి కుస్తీ సీన్స్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వక పోవడం కొంచం మైనస్ అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా కథ చాలా సింపుల్ గా ఉండటంతో ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉన్న ఈ సినిమా టైటిల్ చూసి ఏ దంగల్, సుల్తాన్ లాంటి సీరియస్ మూవీని ఆశిస్తే అక్కడ డిఫెరెంట్ జానర్ మూవీ వస్తుంది. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది ఈ మట్టి కుస్తీ సినిమా… సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here