Home గాసిప్స్ అఖిల్ సినిమాలో మెగాస్టారా….ఇదెక్కడి న్యూస్ రా బాబు!

అఖిల్ సినిమాలో మెగాస్టారా….ఇదెక్కడి న్యూస్ రా బాబు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో ఆడియన్స్ ముందుకు పరిస్థితులు నార్మల్ అయ్యాక రాబోతుండగా అక్కినేని ఫ్యాన్స్ ఎక్కువగా ఈ సినిమా కన్నా కూడా ఇప్పుడు మరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న సినిమా ఏజెంట్ భారీ లెవల్ లో రూపొందుతున్న యాక్షన్ మూవీ అవ్వడంతో…

ఆ సినిమా తో అఖిల్ కి తిరిగి ఫస్ట్ మూవీ రేంజ్ లో ఓపెనింగ్స్ లభించడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. ఫస్ట్ మూవీ అఖిల్ అల్టిమేట్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేయగా సినిమా అంతంత మాత్రమే ఉండటం తో ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పడి తర్వాత సినిమాల పై…

గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. మళ్ళీ అఖిల్ రేంజ్ అంచనాలను ఇప్పటి నుండే సొంతం చేసుకుంటున్న ఏజెంట్ సినిమా లో ఇప్పుడు మరో బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఉండబోతుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఒక కీలక రోల్ లో ఓ టాప్ స్టార్ నటించబోతున్నారట.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమా లో ఒక కీలక రోల్ చేయబోతున్నారు అంటూ వార్తలు చాలా గట్టిగానే టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి ఇప్పుడు. మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమా చేయగా మళ్ళీ ఇప్పటి వరకు తెలుగు లో ఎలాంటి కథని ఓకే చేయలేదు. కానీ మళ్ళీ ఈ కథ నచ్చడం వలన భారీ రెమ్యునరేషన్ ని తీసుకుని అఖిల్ సినిమాలో…

కీలక రోల్ లో నటించడానికి ఒప్పుకున్నారు అని అంటున్నారు. ఇది కనుక నిజం అయితే సినిమా పై అంచనాలు మరో లెవల్ కి చేరుకోవడం ఖాయం కాగా మలయాళం లో కూడా సినిమా పై అంచనాలు పెరిగి పోవడం అక్కడ మార్కెట్ ఏర్పడటం ఖాయమని చెప్పొచ్చు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here