Home న్యూస్ 295 కోట్ల హీరో….బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ…మిరాయ్ గ్లిమ్స్ రివ్యూ!

295 కోట్ల హీరో….బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ…మిరాయ్ గ్లిమ్స్ రివ్యూ!

0

ఈ ఇయర్ సంక్రాంతికి ఊహకందని రేంజ్ లో అన్ని చోట్లా రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan Movie) అల్టిమేట్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. టోటల్ రన్ లో 295 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా….

ఎపిక్ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత తేజ సజ్జ కొత్త సినిమాను కమిట్ అయ్యాడు…..ఈగల్ తో మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఇప్పుడు ఏకంగా బిగ్ పాన్ ఇండియా మూవీ మిరాయ్(Mirai Movie) చేస్తున్నాడు. రీసెంట్ గా సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో ఈ గ్లిమ్స్ పెంచేసింది….

సామ్రాట్ అశోక్ కథతో….చరిత్రలో నిలిచే ఖలింగ యుద్ధం మీద బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందుతూ ఉండగా సూపర్ యోధగా తేజ సజ్జ ఇందులో నటించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీలో మేజర్ భాషలు అన్నింటిలో కూడా ఈ సినిమా ఉండబోతుంది…. హనుమాన్ సినిమాతో ఆల్ రెడీ పాన్ ఇండియా వైడ్ గా…

మంచి రీచ్ ను సొంతం చేసుకున్న తేజ సజ్జ ఇప్పుడు జై హనుమాన్ లో కూడా కనిపించనుండగా ఆ సినిమా తో పాటు ఇప్పుడు మిరాయ్ మూవీ చేస్తున్నాడు… ఈ రెండు సినిమాలు అంచనాలను కనుక అందుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో మరో తెలుగు హీరోకి మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంటుంది.

ఇక మిరాయ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 3D లో కూడా రిలీజ్ కాబోతుంది…. ఇక ఈ సినిమాతో తేజ సజ్జ హనుమాన్ మ్యాజిక్ ని మళ్ళీ ఎంతవరకు రీ క్రియేట్ చేయగాలుగుతాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here