Home న్యూస్ అఖిల్ అక్కినేని మాస్….క్లాస్ సినిమా ఊరమాస్ రేటు పలికిందిగా!!

అఖిల్ అక్కినేని మాస్….క్లాస్ సినిమా ఊరమాస్ రేటు పలికిందిగా!!

0

అక్కినేని అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించగా మూడు సినిమాలు మంచి అంచనాల నడుమే ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని ఫ్లాఫ్స్ గా మిగిలాయి, ఇలాంటి టైం లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో పూజా హెడ్గే హీరోయిన్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో…

ఇప్పుడు దసరా బరిలో సందడి చేస్తూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి దక్కింది అని చెప్పాలి. కంప్లీట్ గా క్లాస్ లవ్ స్టొరీ అయిన ఈ సినిమా పై బయ్యర్స్ లో మంచి అంచనాలే ఉన్నట్లు తెలుస్తుంది.

సినిమా కి అన్ని ఏరియాల నుండి బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గా వస్తూ ఉండగా కోస్టల్ ఆంద్ర ఏరియా కి గాను ఓవరాల్ గా సినిమా బిజినెస్ కంప్లీట్ అవ్వడం విశేషం అని చెప్పాలి. అది కూడా సాలిడ్ రేటు కి సొంతం అవ్వడం విశేషం.

సినిమా ను మొత్తం మీద కోస్టల్ ఆంద్ర ఏరియాకి 10 కోట్ల రేంజ్ రేటు కి అమ్మినట్లు తెలుస్తుంది. మూడు సినిమాలు వరుస ఫ్లాఫ్స్ అయినా కానీ ప్రస్తుతం ఆంధ్రలో పరిస్థితులు ఇంకా సెట్ కాకపోయినా కానీ ఈ రేంజ్ బిజినెస్ ప్రపోజల్ సినిమాకి దక్కడం విశేషం అనే చెప్పాలి. సినిమా రిలీజ్ టైం కి టికెట్ రేట్ల ఇష్యూ సాల్వ్ అయితే ఈ రేటు లేదా కొంచం తగ్గే…

అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా ఇప్పుడు 20 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. క్లాస్ సినిమా తో ఊరమాస్ అనిపించే బిజినెస్ ఇది. మరి ఇదే ఫైనల్ అవుతుందా లేక రేట్ల ఇష్యూ వలన ఏమైనా తగ్గుతుందా అన్నది రిలీజ్ టైం నాటికి క్లియర్ గా తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here