సినిమాలు చూడటానికి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి సినిమా యూనిట్ ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడతారు… అందులో భాగంగా సినిమా కలెక్షన్స్ ని పోస్టర్స్ పై పెట్టి రిలీజ్ చేయడం అన్నది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇలా కలెక్షన్స్ పోస్టర్స్ ఎందుకు వదులుతాం అన్నది రీసెంట్ గా నిర్మాతల్లో ఒకరు డైరెక్ట్ గానే జనాలను మోసం చేయడానికి వాళ్ళని థియేటర్స్ కి రప్పించడానికి చేసే ప్రమోషన్స్ లో భాగం అని…
క్లియర్ గానే చెప్పేశారు… రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి వసూళ్ళతో రన్ అవుతూ ఉండగా సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ అందరికీ ఒకింత శాకిచ్చాయి. దానికి కారణం ట్రేడ్ వర్గాలలో చాలా వరకు కలెక్షన్స్ గ్రాస్ లెక్క…
28-29 కోట్ల రేంజ్ లో వీకెండ్ కి గాను కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తే నిర్మాతలు మాత్రం 3 రోజుల్లో సినిమా 24 కోట్లు వసూల్ చేసిందని చెప్పారు, 2 రోజుల్లో కూడా 20-21 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలు వేస్తె నిర్మాతలు 18 కోట్ల కలెక్షన్స్ అని పోస్టర్స్ వేసి అందరినీ ఆశ్యర్య పరిచారు..
చాలా వరకు సినిమాల కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు ఉన్నవి ఉన్నట్లు వేస్తె… ఫ్యాన్స్ కొంచం ఎక్కువ వచ్చాయి అని నమ్ముతారు… మేకర్స్ పబ్లిసిటీ కోసం ఫ్యాన్స్ నంబర్స్ కన్నా ఎక్కువ నంబర్స్ తో పోస్టర్స్ వదిలి సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటారు కానీ ఎవ్వరూ కలెక్షన్స్ ని తక్కువ చేసి చెప్పుకోరు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయం లో మాత్రం…
ట్రేడ్ వర్గాలు వేసిన కలెక్షన్స్ కన్నా కూడా నిర్మాతలు వదిలిన పోస్టర్ కలెక్షన్స్ తక్కువగా ఉండటం అందరినీ ఆశ్యర్య పరిచింది, ఫ్యాన్స్ కూడా ఇలా తక్కువ కలెక్షన్స్ పోస్టర్స్ వెనుక ఉన్న స్టాటజీ ఏంటి అని తలపట్టుకుంటున్నారు. కారణం ఏదైనా కానీ టాలీవుడ్ లోనే ఇప్పటి వరకు ఏ సినిమా కి జరగని తక్కువ కలెక్షన్స్ పోస్టర్ స్టాటజీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయంలో జరిగింది అని చెప్పాలి.