అఖిల్ అక్కినేని నటించిన 4 వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగడానికి సిద్ధం అవుతున్న వేల సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఇప్పుడు భారీ రిలీజ్ ను సొంతం చేసుకోవడం ఖాయం అనుకున్నా కానీ దసరా పోటి వలన సినిమా కి…
మరీ అనుకున్న రేంజ్ థియేటర్స్ ఏమి దొరకలేదు… ఒకసారి థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నైజాంలో 180 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సీడెడ్ లో 100 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఆంధ్ర రీజన్ లో 200 వరకు థియేటర్స్ లో…
రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా బిజినెస్ దృశ్యా మినిమం 600 వరకు థియేటర్స్ దొరకాల్సింది కానీ పోటి వలన దొరకలేదు, ఇక వరల్డ్ వైడ్ గా 780 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా…
ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగు రోజుల ముందు నుండే మొదలు అవ్వగా క్లాస్ సెంటర్స్ లో మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే బుకింగ్స్ కనిపించాయి. ఇక ఇప్పుడు ఆంధ్రలో 100% ఆక్యుపెన్సీ కూడా ఉంది కాబట్టి టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ జోరు బాగుండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ప్రజెంట్ బుకింగ్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ గ్రోత్ బాగుంటే సినిమా 4 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఓపెన్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇక టాక్ బాగుండి షో షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతూ వెళితే ఫస్ట్ డే దసరా హాలిడే అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చి 5 కోట్ల కి పైగానే ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.