Home న్యూస్ బాలీవుడ్ లో హర్రర్ కామెడీ రచ్చ….ముంజ్య టాక్ అండ్ డే 1 కలెక్షన్స్!

బాలీవుడ్ లో హర్రర్ కామెడీ రచ్చ….ముంజ్య టాక్ అండ్ డే 1 కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో అనుకున్న రేంజ్ లో హిట్స్ పడటం లేదు…సమ్మర్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్న తర్వాత ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఒక హర్రర్ కామెడీ మూవీ రచ్చ లేపింది…. బాలీవుడ్ లో స్త్రీ, భేడియా లాంటి హర్రర్ యూనివర్స్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు అందులో భాగంగా వచ్చిన….

లేటెస్ట్ మూవీ ముంజ్య(Munjya Movie) ట్రైలర్ రిలీజ్ తో మంచి హైప్ ను అందుకుంది. అసలు స్టార్ కాస్ట్ ఏంటో కూడా ఎవ్వరికీ తెలియని ఈ సినిమా జస్ట్ ట్రైలర్ రిలీజ్ తో హైప్ ను దక్కించుకుని స్త్రీ, భేడియా హర్రర్ యూనివర్స్ లో భాగం అని చెప్పడంతో శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది….

చిన్న ఏజ్ లోనే చనిపోయిన ఒక ఆత్మ కొంత టైం తర్వాత హీరోని పట్టి వేదిస్తుంది…దాని వెనక రీజన్ ఏంటి…హీరో ఆ దెయ్యం నుండి విముక్తి కోసం ఏమేమి చేశాడు…స్త్రీ, భేడియా యూనివర్స్ కి ముంజ్యని ఎలా లింక్ చేశారు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పాలి…సినిమా కథ సింపుల్ గానే అనిపించినా కూడా…

ఆడియన్స్ ఆలోచించడానికి పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ మ్యాజిక్ చేయగా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా మంచి హర్రర్ మూవీ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా మిక్స్ చేయడంతో బాగుంది అనిపించేలా మెప్పించింది సినిమా…

ఇక పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేని సినిమా మొదటి రోజు 110K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇండియాలో మొదటి రోజు 4.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి స్టార్ట్ ను దక్కించుకోగా వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అన్తున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here