స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ ల కాంబినేషన్ లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా రెండున్నర ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ అంచనాలు ఎక్కువ అవ్వడం తో అవి అందుకోలేక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టలనే మిగిలించింది, కానీ అల్లు అర్జున్ నటనకి ఫుల్ మార్కులు పడ్డాయి.
తర్వాత ఈ సినిమా హిందీ లో కూడా డబ్ చేసి చాలా లిమిటెడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు కూడా, అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎంత సాధించింది అన్నది క్లియర్ లెక్కలు బయటికి రాలేదు.
ఇక కరోనా టైం తర్వాత థియేటర్స్ అన్నీ కూడా రీ ఓపెన్ అవ్వగా నార్త్ సైడ్ బాలీవుడ్ మూవీస్ ని రీ రిలీజ్ చేయగా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు, కాగా అదే టైం లో అనుకోకుండా కొన్ని సెంటర్స్ లో నా పేరు సూర్య హిందీ వర్షన్ సూర్య ది సోల్జర్ ని….
రిలీజ్ చేయగా రెస్పాన్స్ రీ రిలీజ్ అయిన హిందీ సినిమాల కన్నా బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తూ దుమ్ము లేపుతుంది ఈ సినిమా, అక్కడ మాస్ సర్క్యూట్స్ అయిన బీహార్, లాంటి మాస్ ఏరియాలలో అలాగే కోల్కతా, మరికొన్ని మేజర్ ఏరియాల్లో సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉందని కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద సినిమా…
ఇప్పటి వరకు అక్కడ 25 లక్షల దాకా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. సినిమా రెస్పాన్స్ ని చూసి మరిన్ని సింగిల్ స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారట. రెండున్నర ఏళ్ల క్రితం మూవీ కే రెస్పాన్స్ అదిరిపోగా అల్లు అర్జున్ కొత్త మూవీ పుష్ప కి మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.