Home న్యూస్ ట్రేడ్ టాక్: 33-36 మధ్యల్లో ఇరుక్కున్న నాని “వి” సినిమా!

ట్రేడ్ టాక్: 33-36 మధ్యల్లో ఇరుక్కున్న నాని “వి” సినిమా!

0

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా వి ది మూవీ… సుదీర్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ రేసు లో ముందు రిలీజ్ అవ్వాల్సి ఉండేది కానీ పరిస్థితుల వలన సినిమా నిరవధికంగా పోస్ట్ పోన్ అవుతూ రాగా ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతుంది అనుకున్నారు అంతా…

కానీ సినిమా కి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ల కింద వస్తున్న రేట్లు సాలిడ్ గానే ఉండటం తో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పటికీ నాని ఇందుకు నో చెప్పగా… మరికొంత కాలం కూడా పరిస్థితులు చక్కదిద్దుకునేలా కనిపించడం లేదు కాబట్టి మనసు మార్చుకున్నారు.

ఇక డిజిటల్ ఆఫర్స్ అన్నీ 30 నుండి 32 కోట్ల రేంజ్ లో ఉన్నాయని ట్రేడ్ లో టాక్ రాగా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కి 33.5 కోట్ల రేంజ్ రేటు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. నాని ప్రెజంట్ మార్కెట్ దృశ్యా బిజినెస్ రేంజ్ అవలీలగా 35 కోట్లకు అటూ ఇటూగా…

ఉండే అవకాశం ఈజీగా ఉంది, అందునా ఇది 25 వ సినిమా కాబట్టి ఈ రేంజ్ బిజినెస్ పక్కగా జరిగి ఉండేది. దాంతో యూనిట్ ఇప్పుడు 35-36 కోట్ల రేంజ్ రేటు కోసం ట్రై చేస్తున్నారని, మంతనాలు జరుగుతున్నాయని, ఎదో ఒక విషయం తెలుస్తుందని అంటున్నారు. ఆ రేటు ఫైనల్ అయిన వెంటనే యూనిట్ అఫీషియల్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేస్తారని అంటున్నారు.

టాలీవుడ్ లో ఆల్ రెడీ సినిమా సెప్టెంబర్ 5 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది అన్న బజ్ ఉంది, యూనిట్ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు కూడా. దాంతో ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అంటున్నారు. త్వరలోనే రేటు ఫైనల్ అయిన వెంటనే సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అలాగే డిజిటల్ రిలీజ్ డేట్లు రివీల్ అవుతాయి అంటున్నారు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here