Home న్యూస్ 85 కోట్ల సినిమా నష్టం….నారప్ప తీర్చింది ఆ కష్టం…మాస్ ఇది!

85 కోట్ల సినిమా నష్టం….నారప్ప తీర్చింది ఆ కష్టం…మాస్ ఇది!

0

విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ అసురన్ సినిమా తెలుగు రీమేక్ గా వచ్చిన నారప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ పరిస్థితుల కారణంగా సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఏకంగా 40 కోట్ల మమ్మోత్ రేటు పలికిన ఈ సినిమా ఆ రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ…

దుమ్ము లేపగా రిలీజ్ అయిన మూడు వారాల్లో అమెజాన్ ప్రైమ్ కి అల్టిమేట్ లాభాలను వచ్చేలా కూడా చేసింది. ఇక్కడ మరో విశేషం ఎంతంటే సినిమా కి వచ్చిన లాభాలు మరో సినిమా నష్టాలను కూడా భరించే విధంగా ఉండటం విశేషం అని చెప్పాలి.

ఈ సినిమా కన్నా ముందు ప్రైమ్ వీడియో వాళ్ళు ఏకంగా 85 కోట్ల రేటు కి ఫర్హాన్ అక్తర్, రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా ల క్రేజీ కాంబినేషన్ లో భాగ్ మిల్కా భాగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన తూఫాన్ సినిమా డిజిటల్ రైట్స్ ను కొని డైరెక్ట్ రిలీజ్ చేశారు.

సినిమా రిలీజ్ అయిన టైం ముందే పెద్దగా బజ్ ఏమి క్రియేట్ చేయలేదు, రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే టాక్ కూడా నెగటివ్ గా ఉంటడం తో ఆ ఇంపాక్ట్ కూడా పడి వ్యూస్ ఏమాత్రం ఆశించిన మేర రాలేదు. ఈ సినిమా వల్ల ఆల్ మోస్ట్ 30 కోట్ల మేర నష్టం ప్రైమ్ వీడియో వాళ్ళకి వచ్చిందని ట్రేడ్ లో టాక్ ఉంది.

ఆ నష్టాన్ని తర్వాత వచ్చిన నారప్ప సినిమా సౌత్ మొత్తం అల్టిమేట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం తో ఆల్ మోస్ట్ నష్టాన్ని బర్తీ చేసే రేంజ్ లో పెట్టిన రేటు కి డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుందట. దాంతో 40 కోట్ల నారప్ప 85 కోట్ల తూఫాన్ సినిమా నష్టాలను కూడా కవర్ చేసే రేంజ్ లో డిజిటల్ లో విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here