బాహుబలి కి ముందు వరకు తెలుగు సినిమాల మార్కెట్ ఎంతా అంటే 70 కోట్ల రేంజ్ అని చెప్పుకునే వాళ్ళు కానీ బాహుబలి రిలీజ్ అయ్యాక మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీ ఎత్తున జరిగి సినిమాల బిజినెస్ లు ఆ రేంజ్ లో జరగడం మొదలు అయింది, ఇక పెద్ద హీరోల సినిమాలకు అయితే బిజినెస్ ఇప్పుడు మినిమమ్ 100 కోట్ల రేంజ్ లో చేరుకునే రేంజ్ లో టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరిగింది.
బాహుబలి సినిమాలు కాకుండా తెలుగు లో ఫస్ట్ 100 కోట్ల బిజినెస్ మూవీ గా మహేష్ బాబు స్పైడర్ తెలుగు తమిళ్ కలిపి ఈ మార్క్ ని అందుకోగా కేవలం తెలుగు సినిమానే చూసుకుంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఈ మార్క్ ని అందుకుంది.
ఇక ఓవరాల్ గా మహేష్ బాబు ఆల్ మోస్ట్ 3 సార్లు 100 కోట్ల రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో బిగ్గెస్ట్ మనీ స్పిన్నర్ గా నిలిచాడు, ఇక సాహో, సైరా లాంటి సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో భారీ బిజినెస్ తో దుమ్ము లేపాయి..
మొత్తం మీద టాప్ 10 హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాలను గమనిస్తే
1. Baahubali2 – 350cr
2. Saaho – 270cr
3. SyeRaa Narasimha Reddy-187.25Cr
4. Agnyaathavaasi – 125cr
5. SPYder – 124cr+
6. Baahubali1 – 117cr +
7. Maharshi – 100CR
8. BharatAneNenu- 100cr
9. Sarileru Neekevvaru- 99.30Cr
10. Aravindha Sametha- 91cr
11. Vinaya Vidheya Rama – 90cr
12. KhaidiNo150- 89Cr
13. Sardar Gabbar Singh – 87.7cr
14. JaiLavaKusa- 86Cr
15. KaatamaRayudu – 84.5cr
16.Ala Vaikunthapurramuloo- 84.34Cr
17. Rangasthalam – 80Cr
ఇవీ మొత్తం మీద రీసెంట్ టైం లో హైయెస్ట్ బిజినెస్ లు సొంతం చేసుకున్న సినిమాలు. బాహుబలి అండ్ పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే మిగిలిన సినిమాలు ఇంకా అజ్ఞాతవాసి బిజినెస్ ను బ్రేక్ చేయాల్సి ఉంది, ఇక బాహుబలి రికార్డ్ బిజినెస్ ని ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.