యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భీష్మ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి మంచి జోష్ మీద ఉన్నాడు, ఈ సినిమా కి ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నితిన్ భీష్మ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసు కుని కంబ్యాక్ ఇవ్వగా ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ రంగ్ దే పై ఆడియన్స్ లో…
మంచి అంచనాలు ఉన్నాయి అన్ని చెప్పాలి. ఈ సినిమా సమ్మర్ రేసులోనే నిలిచినా కరోనా వలన కుదరక పోస్ట్ పోన్ అయిన సినిమా ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక కూడా సరైన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉండగా మరో పక్క సినిమా కి డైరెక్ట్…
డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వస్తూనే ఉండగా వాటిలో బిగ్గెస్ట్ ఆఫర్ ను జీ 5 వాళ్ళు 38 కోట్ల భారీ రేటు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ యూనిట్ 40 కోట్ల రేంజ్ రేటు డిమాండ్ చేయగా అప్పటి నుండి ఎలాంటి కొత్త అప్ డేట్ ఏమి రాలేదు.
రీసెంట్ గా జీ 5 వాళ్ళు ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వకపోవడంతో వచ్చిన రేటు కూడా తక్కువ కాదు కాబట్టి ఆ ఆఫర్ కి ఓకే చెప్పాలని ఆలోచిస్తూ ఉండగా, రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా అన్ని హక్కులను కొన్నట్లుగానే ఇప్పుడు రంగ్ దే అన్ని హక్కులను సొంతం చేసుకోబోతుందట జీ నెట్ వర్క్… అందుకే అంత రేటు ఇవ్వడానికి…
ముందుకు వచ్చారని అంటూ ఉండగా కానీ థియేట్రికల్ రిలీజ్ కాకుండా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. కానీ ఇప్పుడు రంగ్ దే టీం వాళ్ళు సోలో బ్రతుకే సో బెటర్ లానే థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయాలనీ చెప్పారట. ఈ రూల్ కి ఓకే అంటే సినిమాను అమ్మాలని యూనిట్ భావిస్తుందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో త్వరలో తేలనుంది.