బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప సినిమా ఓ రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పాలి. చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వలన అన్ని చోట్లా సజావుగా రిలీజ్ ను సొంతం చేసుకుంటుందో లేదో అన్న అనుమానాలు ఏర్పడగా కొన్ని చోట్ల రిలీజ్ ఆ రోజు జరగక పోయినా కానీ సినిమాను అనుకున్నట్లే డిసెంబర్ 17 న రిలీజ్ చేసి టీం మంచి పనే చేశారు…
ఆ ఇంపాక్ట్ ఇప్పుడు 3rd వేవ్ ఎంటర్ అవ్వడంతో లాస్ట్ బెస్ట్ రన్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతుంది పుష్ప సినిమా… ఈ రోజు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యి ఉంటే పుష్ప సినిమా థియేట్రికల్ రన్ అన్ని చోట్లా కూడా ఎండ్ అయ్యి ఉండేది…
కానీ 3rd వేవ్ వలన ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అవ్వడం కలిసి రావడంతో అన్ని ఇండస్ట్రీలలో ఈ వారం రిలీజ్ కి ఒక్క సినిమా కూడా లేక పోవడంతో మళ్ళీ పుష్ప సినిమా ఒక్కటే అన్ని ఇండస్ట్రీలలో ఏకైక ఆప్షన్ గా మారిపోయింది. దాంతో సినిమా రిలీజ్ అయిన…
3వారాల తర్వాత ఇప్పుడు నాలుగో వారంలో ఎంటర్ అవ్వగా పరాయి రాష్ట్రం తమిళనాడులో ఊహకందని థియేటర్స్ కౌంట్ ని ఇప్పుడు ఈ సినిమా సొంతం చేసుకుంది, అక్కడ వచ్చే వారం వచ్చే వలిమై కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో పుష్ప కి ఇంకా లాంగ్ రన్ దక్కే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి. కాగా నాలుగో వారంలో తమిళనాడులో ఈ సినిమా…
ఇప్పుడు 275 థియేటర్స్ లో పరుగును కొనసాగించబోతుంది… అక్కడ రిలీజ్ టైం కి ఇలాంటి థియేటర్స్ కౌంట్ ఇతర భాషల సినిమాలకు దొరకడమే చాలా కష్టం అలాంటిది రిలీజ్ అయిన 4 వ వారంలో ఈ రేంజ్ లో థియేటర్స్ కౌంట్ ని ఈ సినిమా సొంతం చేసుకోవడం మామూలు ఊచకోత కాదనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ రూపంలో ఎలా ఉంటుందో చూడాలి.