Home TRP రేటింగ్ ఎన్టీఆర్ టార్గెట్ 20.8…కొడుతుందా లేదా??

ఎన్టీఆర్ టార్గెట్ 20.8…కొడుతుందా లేదా??

1

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత భారీ అంచనాల దసరా బరిలో నిలిచి అల్టిమేట్ ఓపెనింగ్స్ తో భీభత్సమైన రికార్డులను నమోదు చేయగా తర్వాత స్లో డౌన్ అయినా టోటల్ రన్ లో 98.9 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది. కాగా ఈ సినిమా ఇప్పుడు టెలివిజన్ లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతుంది. ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కొన్ని టి.ఆర్.పి రేటింగ్ ల పరంగా దుమ్ము లేపాయి.

వాటిలో మహానటి 20.21 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకోగా ఆ రికార్డ్ ను గీత గోవిందం సినిమా 20.8 టి.ఆర్.పి రేటింగ్ తో బ్రేక్ చేసి ప్రస్తుతానికి ఇయర్ టాపర్ గా నిలిచింది. పాత టి.ఆర్.పి రేటింగ్ రికార్డుల ప్రకారం టెంపర్ తో ఎన్టీఆర్ 26.6 టి.ఆర్.పి రేటింగ్ ని అందుకుని టాప్ లో ఉండగా..

కొత్త టి.ఆర్.పి రేటింగ్ ల ప్రకారం ఈ ఇయర్ బెస్ట్ అనిపించు కోవాలి అంటే మాత్రం గీత గోవిందం సినిమా 20.8 టి.ఆర్.పి రేటింగ్ ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అంతకుమించి ముందుకు వెళితే టాలీవుడ్ హిస్టరీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ లలో ఒకటిగా నిలిచే చాన్స్ ఉంది. మరి కొడుతుందో లేదో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here