శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో జరుగుతుండగా సినిమా వచ్చే ఏడాది జులై ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే, కాగా ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఎవరితో అన్నది…
ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి, RRR తో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ పెరగడం ఖాయం కాబట్టి దానికి తగ్గ కథలను ఎంపిక చేసుకునే పనిలో ఇప్పటి నుండే నిమగ్నమై ఉన్నాడట ఎన్టీఆర్. దాంతో ఇప్పటికే 20 కి పైగా కథలు విన్నాడట ఎన్టీఆర్. అందులో ఇప్పటికే ఒక మూడు కథలను ఫైనల్ చేశాడట.
జక్కన్న తో సినిమా చేసిన తర్వాత సినిమా ఫ్లాఫ్ కొట్టడం టాలివుడ్ లో రివాజు గా మారింది, దాదాపు అందరు హీరోల పరిస్థితి ఇదే, ఇప్పుడు ప్రభాస్ సాహో రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది, ఇవన్నీ దృష్టి లో పెట్టుకుని మూడు కథలని ఓకే చేశాడట ఎన్టీఆర్.
ఆ మూడు కథల్లో ఒకటి తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కథ ఉంది అనేది ఇండస్ట్రీ టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. RRR లో యంగ్ కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.