ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ గా అల్టిమేట్ హిట్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న సిద్దార్థ్, ఇక్కడ వరుస ఫ్లాఫ్స్ రావడం తో కోలివుడ్ ఇండస్ట్రీ కి మకాం మార్చి అప్పుడప్పుడు తెలుగు లో సినిమాలను డబ్ చేస్తూ ఆడియన్స్ ను పలరిస్తున్నాడు కానీ ఒకప్పటి తన క్రేజ్ అమాంతం పడిపోయింది అనడం లో ఎలాంటి సందేహం లేదు… రీసెంట్ తమిళ్ లో తన హిట్ మూవీ ని తెలుగు లో ఒరేయ్ బామ్మర్ది పేరుతో…
తెలుగు లో రూపొందించి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా తీసుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో బిజినెస్ పరంగా ఎంత వరకు బిజినెస్ చేసింది అన్న వివరాలు ఏమి కూడా…
రివీల్ చేయలేదు కానీ ఒక 1.1 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగి ఉంటుందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్ రోజున 23 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేయగా మొదటి వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 38 లక్షల గ్రాస్ ను వసూల్ చేసింది.
ఇక వర్కింగ్ డే లో మరో 3 లక్షల మేర కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద 4 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 41 లక్షల గ్రాస్ ను 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవి మరీ తీసివేసే కలెక్షన్స్ ఏమి కావు కానీ ఒకప్పటి సిద్దార్థ్ మార్కెట్ తో పోల్చితే మాత్రం…
చిల్లర కలెక్షన్స్ అనే చెప్పాలి, కానీ సినిమా పై అసలు ఏమాత్రం బజ్ అండ్ క్రేజ్ లేకున్నా ఈ మాత్ర్రం కలెక్షన్స్ ఇప్పుడు సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక. ట్రేడ్ లెక్కల ప్రకారం క్లీన్ హిట్ కి ఇంకా 1 కోటి షేర్ అయినా సాధించాల్సి ఉంటుంది.