Home న్యూస్ పెద్దన్న ట్రైలర్ టాక్…ఈ సారి మాస్ రాంపేజ్ పక్కా!!

పెద్దన్న ట్రైలర్ టాక్…ఈ సారి మాస్ రాంపేజ్ పక్కా!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి ఓ పక్కా కమర్షియల్ హిట్ వచ్చి చాలా కాలమే అయింది, రీసెంట్ టైం లో వచ్చిన సినిమాలు అన్నీ ఆడియన్స్ ను ఫుల్ గా అయితే సాటిస్ ఫై చేయలేదు. ఇలాంటి టైం లో రజినీ మరియు విశ్వాసం ఫేం శివ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అన్నాత్తే తెలుగు లో పెద్దన్నగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా నవంబర్ 4 న…

రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయినప్పుడే వింటేజ్ రజినీని గుర్తు చేస్తూ మరో నరసింహ రేంజ్ మూవీలా అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ స్టార్ రజినీ నుండి ఈ సారి…

మాస్ రాంపేజ్ ఖాయం అనిపించే రేంజ్ లో మెప్పించింది ఈ సినిమా ట్రైలర్… రాజోలు గ్రామం గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ అయిన హీరో కి ఒక చెల్లెలు కీర్తి సురేష్… తనకి ఎక్కిళ్ళు వచ్చినా గ్రహించే అన్న తన లైఫ్ లో ఎదురుకున్న ఒక ఇంసిడెంట్ ను తెలుసుకున్న తర్వాత…

తనని కాపడానికి శత్రువులతో ఎలా పోరాడాడు అన్నది సినిమా కథ పాయింట్ గా ట్రైలర్ లో చూపెట్టారు.. కొంచం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నప్పటికీ రజినీ మాస్ డైలాగ్స్, స్టైల్ అండ్ యాక్ష్సన్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో కలిసి రావడం తో మొత్తం మీద ట్రైలర్ అంచనాలను మించి పోయే రేంజ్ లో మాస్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి…

మొత్తం మీద కథ కీర్తి సురేష్ చుట్టూ తిరగూ ఉంటుందని కన్ఫాం అవ్వగా ఇలాంటి కథలతో చాలా సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ అక్కడుంది రజినీ కాబట్టి ఏ రేంజ్ లో ఎలివేషన్ లు పడితే సినిమా మరో లెవల్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here