Home న్యూస్ పేట కి థియేటర్స్ ఇవ్వట్లేదు…దౌర్జన్యం చేస్తున్నారు..డిస్ట్రిబ్యూటర్ షాకింగ్ కామెంట్స్

పేట కి థియేటర్స్ ఇవ్వట్లేదు…దౌర్జన్యం చేస్తున్నారు..డిస్ట్రిబ్యూటర్ షాకింగ్ కామెంట్స్

0

      రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెన్ లో భాగంగా డిస్ట్రిబ్యూటర్లు చేసిన వాఖ్యలు ఇప్పుడు వివాదాన్ని రేపుతున్నాయి. తెలుగు లో సంక్రాంతి కి 3 పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధం కాగా సడెన్ గా రేసు లోకి ఎంటర్ అయిన పేట సినిమా కి థియేటర్స్ ఇవ్వడం లేదు అని దౌర్జన్యం చేస్తూ మాఫియా లా థియేటర్స్ ని దగ్గరే పెట్టుకుంటున్నారు అంటూ….

చేసిన కామెంట్స్ ఇప్పుడు భారీ వివాదానికి దారి తీస్తున్నాయి. సంక్రాంతి కి తమ సినిమాలు రాబోతున్నాయి అని మూడు సినిమాలు ఎప్పుడో మూడు నెలల ముందే అనౌన్స్ చేశారు. 15 రోజుల క్రితం వరకు పేట తెలుగు డబ్ సంక్రాంతి వస్తుందని కూడా న్యూస్ లేదు.

సడెన్ గా రేసు లో ఎంటర్ అయితే అప్పటికీ అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్స్ ఓనర్స్ ఇప్పుడు కావలసినన్ని థియేటర్స్ ఎలా ఇస్తారు అన్నది ఇండస్ట్రీ టాక్. వినయ విదేయ రామ 77 కోట్ల బిజినెస్ ని, ఎన్టీఆర్ కథానాయకుడు 54 కోట్ల బిజినెస్ ని, F2 ఒక 35 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని రెండు రాష్ట్రాలలో సాధించింది.

ఈ మూడు సినిమాల లెక్కే ఏకంగా 165 కోట్లకు పైగా సంక్రాంతి రేసు లో రెండు రాష్ట్రాలలో రికవరీ చేయాలి. అంత చేయాలి అంటే థియేటర్స్ ఎక్కువగా ఉంటెనే కదా టాక్ బాగుంటే సాధ్యం అయ్యేది అన్నది అందరు చెబుతున్న మాట. ఇక రేసులో చివరగా ఎంటర్ అయ్యి…

13 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన పేట కి థియేటర్స్ ఎక్కువ ఎలా ఇస్తారు అని కూడా అంటున్నారు. ఇవి వరకు రోబో 2.0 కి ఇక్కడ 1000 కి పైగా థియేటర్స్ ఇవ్వలేదా అని కూడా అంటున్నారు. ఇప్పుడు మన సినిమాలే డబ్ కి సిద్ధం అయ్యి తమిళ్ లో సంక్రాంతి లో రిలీజ్ చేస్తాం అంటే…. విశ్వాసం, పేట థియేటర్స్ తో సమానంగా మనకు థియేటర్స్ ఇస్తారా…ఇవ్వరు కదా…

సంక్రాంతి అన్నది తెలుగు ప్రేక్షకులు భారీ గా థియేటర్స్ కి వచ్చే సీజన్… ఎక్కువగా తెలుగు సినిమాలు చూడాలి అని కోరుకునే సీజన్, అయినా అప్పుడప్పుడు ఐ, గ్యాంగ్ అంటూ డబ్బింగ్ మూవీస్ ఇక్కడ కూడా భారీ రిలీజ్ నే సొంతం చేసుకున్నాయి.

కానీ ఈ సారి మూడు సినిమాలు భారీ పెద్ద స్టార్స్ నటించిన సినిమాలే అవ్వడం తో వేరే సినిమాలకు థియేటర్స్ దొరకరం కష్టం అయింది.. కానీ అంతిమంగా ఎ సినిమా కి టాక్ బాగుంటే ఆ సినిమానే ఫైనల్ గా కలెక్షన్స్ అందుకుని హిట్ అవుతుంది. అది గమనిస్తే సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here