బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్1 సినిమా తమిళ్ లో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది కానీ తెలుగు ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో ఆదరించలేదు… ఇదేం సినిమా రా బాబు, ఒక్కరి పేరు గుర్తు లేదు, సీరియల్ లాగా తీశారు అంటూ కామెంట్స్ చేశారు. దాంతో కోలివుడ్ ఆడియన్స్ మీకు టేస్ట్ లేదు అంటూ గొడవలు కూడా చేశారు.
కానీ సినిమా బాగుంటే ఏ భాష అని చూడకుండా ఆదరించే ఇండస్ట్రీ టాలీవుడ్ అని అందరికీ తెలిసేలా ఇతర డబ్బింగ్ మూవీస్ తెలుగు లో కుమ్మేశాక సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు పొన్నియన్ సెల్వన్2 సినిమా టైంలో గొడవ చేస్తారు అనుకున్నా కూడా పార్ట్ 1 తో పొల్చితే…
పార్ట్ 2 ని కోలివుడ్ ఆడియన్స్ కూడా పెద్దగా ఆదరించలేదు, ఇక ఇతర ఇండస్ట్రీల వాళ్ళు ఎగబడి చూస్తారు అనుకోవడం తప్పే… దాంతో తెలుగు లో సినిమా ఫ్లాఫ్ అవ్వగా రీసెంట్ గా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమాను చూసి…
ఇప్పుడు అందరూ ఇదేం సినిమా రా బాబు చూస్తుంటే నిద్రొచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా పార్ట్ 1 కన్నా బాగుంది అనిపించే టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా పార్ట్ 1 దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యాక 2nd రౌండ్ ట్రోల్స్ ని ఫేస్ చేస్తుందని చెప్పాలి.