Home న్యూస్ ఆఫర్ పనికొచ్చింది….బడ్జెట్ మీద డబుల్ కలెక్షన్స్ వచ్చాయి!

ఆఫర్ పనికొచ్చింది….బడ్జెట్ మీద డబుల్ కలెక్షన్స్ వచ్చాయి!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో సక్సెస్ అయిన సినిమాల సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ గా నిలవగా రీసెంట్ గా ఓ చిన్న సినిమా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా కి టాక్ పర్వాలేదు అనిపించేలా ఉండగా టికెట్ ఆఫర్ బాగా కలిసి వచ్చింది.

ఆ సినిమానే జర హాట్కే జర బచ్కే….విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాకి ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ప్రమోషన్ తో రిలీజ్ చేశారు. సెలెక్టివ్ థియేటర్స్ లో ఈ ఆఫర్ ను పెట్టడం ట్రైలర్ కూడా డీసెంట్ గా ఉండటంతో…

సినిమాను చూడటానికి జనాలు భారీగానే థియేటర్స్ కి వస్తూ ఉండటం విశేషం. సినిమా మొత్తం మీద 15 కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో 31 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించి బడ్జెట్ కన్నా డబుల్ వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

సినిమా కి టికెట్ ఫ్రీ ఆఫర్ బాగా వర్క్ అయ్యి జనాలలో మంచి రీచ్ ను సినిమా సొంతం చేసుకోగా సైలెంట్ గా వచ్చి ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది, వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఆదిపురుష్ వచ్చే వరకు హిందీలో మంచి కలెక్షన్స్ ని సాధించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here