లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి మొదట్లో మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ లాంగ్ రన్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1…. ముందు హిందీ లో రిలీజ్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు ఉన్నా కానీ తర్వాత…
ఎలాగోలా రిలీజ్ ను కన్ఫాం చేసుకుని లాంగ్ రన్ లో 108 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇతర భాషల్లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు పార్ట్ 2 కోసం టోటల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అలాంటిది ఇప్పుడు సినిమా మళ్ళీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది, అది ఇక్కడైతే మామూలే కానీ పరాయి గడ్డ మీద మళ్ళీ రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది ఈ సినిమా, అదే అల్లు అర్జున్ కి కంచుకోటగా భావించే కేరళ ఏరియాలో. ఈ సినిమాను అక్కడ త్వరలో…
రీ రిలీజ్ చేయబోతున్నారు… వచ్చే నెలలో 17న పుష్ప పార్ట్ 1 ని థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ తో అనౌన్స్ చేశారు. అక్కడ అవతార్ 2 16 న భారీగా రిలీజ్ కానుంది, పుష్ప 1 17న థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది, ఇక కలెక్షన్స్ సందడి ఎలా ఉంటుందో చూడాలి.