బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) మూవీ రాంపెజ్ ఒకెత్తు అయితే హిందీలో సినిమా చూపిస్తున్న జోరు మరో ఎత్తు అని చెప్పాలి. సెన్సేషనల్ కలెక్షన్స్ తో రిలీజ్ అయిన మొదటి రోజు నుండే రికార్డుల…
మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న పుష్ప2 మూవీ హిందీలో రెండో వీక్ లో అడుగు పెట్టి కూడా మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం. ఈ క్రమంలో సినిమా సౌత్ నుండి హిందీలో డబ్ అయిన మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతూ ఉండగా..
లేటెస్ట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో ఏకంగా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ తో మాస్ ఊచకోత కోసింది. పుష్ప2 మూవీ హిందీలో ఇప్పుడు ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసిన కేజిఎఫ్ చాప్టర్2 సినిమా టోటల్ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి మాస్ రచ్చ చేసింది.
కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ టోటల్ రన్ లో హిందీలో ఏకంగా 435.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక పుష్ప2 మూవీ 9వ రోజు మార్నింగ్ షోల కలెక్షన్స్ తోనే కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ హిందీ నెట్ కలెక్షన్స్ మొత్తాన్ని క్రాస్ చేసి మాస్ రచ్చ చేసి ఇప్పుడు..
ఆల్ టైం టాప్ 2 ప్లేస్ లో ఉండగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి2 మూవీ నెలకొల్పిన 511 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని వీకెండ్ లోపే అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి టాప్ 2 ప్లేస్ లో ఉన్న పుష్ప2 మూవీ రెండో వీకెండ్ ఎండ్ అయ్యే టైంకి టాప్ ప్లేస్ తో ఊచకోత కోయడానికి సిద్ధం అవుతుంది.