మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, కంబ్యాక్ ఇచ్చిన తర్వాతా రాజా ది గ్రేట్ తో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నా కానీ తర్వాత మాత్రం చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా డిస్కో రాజా కూడా అంచనాలను అందుకోలేక భారీ ఫ్లాఫ్ గా పరుగును ముగించి షాక్ ఇచ్చింది.
ఇక రవితేజ క్రేజ్ తగ్గిపోయింది అంటూ అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ బుల్లి తెరపై రవితేజ డిసాస్టర్ సినిమా కి సాలిడ్ TRP రేటింగ్ సినిమా రిజల్ట్ ని బట్టి చూస్తె బాగానే వస్తుందని చెప్పాలి. రవితేజ రీసెంట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటైన నేల టికెట్ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
మరీ 1980’s నాటి స్క్రీన్ ప్లే అండ్ స్టొరీ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో నిరాశ పరిచినా కానీ బుల్లి తెరపై లాంగ్ రన్ సాలిడ్ గానే సాగుతుంది. సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.99 TRP రేటింగ్ ని అందుకోగా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు….
5.9 TRP రేటింగ్ ని అందుకుంది, మూడు నాలుగు సార్లు టెలికాస్ట్ సమయం లో 4 కి అటూ ఇటూ గా TRP రేటింగ్ అందుకున్న ఈ సినిమా తర్వాత 2-3 తగ్గని TRP రేటింగ్ సాధించగా రీసెంట్ గా 8 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఫస్ట్ టైం కన్నా కూడా ఎక్కువ TRP రేటింగ్ దక్కింది.
6.73 TRP రేటింగ్ సాధించి లాంగ్ రన్ లో కూడా సత్తా చాటుకుంది. లాక్ డౌన్ కూడా హెల్ప్ చేసినప్పటికీ ముందుగా చెప్పినట్లే ఎప్పుడో 1980’s స్టైల్ లో ఉండే సినిమా కి ఇది సాలిడ్ TRP రేటింగ్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రవితేజ అప్ కమింగ్ మూవీ క్రాక్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం…..