Home న్యూస్ ఎంతమంచివాడవురా రివ్యూ…పారిపొండిరోయ్!!

ఎంతమంచివాడవురా రివ్యూ…పారిపొండిరోయ్!!

0

       నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా… 118 మూవీ తో మంచి హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ సంక్రాంతి ని టార్గెట్ చేసి తీసిన ఈ ఫ్యామిలీ డ్రామా కి సతీష్ వేగేశ్న డైరెక్టర్. భారీ పోటి లో సంక్రాంతి రేసు లో చివర గా ఎంటర్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అన్న విషయాలు తెలియాలి అంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.

కథ పాయింట్ కి వస్తే అనాధ అయిన హీరో తన లా ఎవ్వరూ లేని వారి కోసం ఒక కంపెనీ పెడతాడు. ఎవరూ లేని వారికి తోడుగా తానూ ఉన్నాను అంటూ ప్రతీ ఒక్కరినీ కలుపుకుంటూ పోయే హీరోకి హీరోయిన్ మేహ్రీన్ కూడా సహాయంగా ఉంటుంది. అలా సాఫీగా సాగుతున్న తన లైఫ్ లో….

అనుకోకుండా ఇసుక మాఫీయా నడిపే రాజీవ్ కనకాల తో గొడవ అవుతుంది, తర్వాత ఏం జరిగింది అన్నది అసలు. కథ… పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ తన పాత్ర వరకు బాగా చేశాడు, సెంటిమెంట్ సీన్స్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నా మిగిలిన సీన్స్ లో ది బెస్ట్ ఇచ్చాడు.

ఫైట్స్ లో తన హీరోయిజం చాలా బాగుంది, ఇక మెహ్రీన్ ఉన్నంతలో తన లుక్స్ తో మెప్పించింది కానీ నటన పరంగా యావరేజ్ మార్కులే. ఇక మిగిలిన స్టార్ ఉన్నంతలో కొద్ది వరకు ఆకట్టుకున్నారు. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపిస్తాయి.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది, సీన్ బై సీన్ వస్తు పోతూ ఉంటాయి కానీ ఆడియన్స్ అస్సలు కనెక్ట్ కారు. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపించే విధంగానే ఉన్నాయి. ఇక డైరెక్షన్ పరంగా సతీష్ వేగేశ్న మరో బ్రహ్మోత్సవం తీశాడు.

ఎమోషనల్ సీన్స్, మంచితనం అడుగడుగునా కనిపిస్తున్నా అది ఆడియన్స్ కనెక్ట్ కాక పొతే అది బ్రహ్మోత్సవం లాంటి సినిమా అవుతుంది, ఎంత మంచి వాడవురా ఆ సినిమా కి సీక్వెల్ లా అనిపిస్తుంది, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా అవి కూడా ఆడియన్స్ ని పెద్దగా కనెక్ట్ కావు.

ఉన్నంతలో కళ్యాణ్ రామ్ పాత్ర బాగుండటం తో హీరో ఫ్యాన్స్ కి కొద్ది వరకు నచ్చే చాన్స్ ఉంది కానీ రెగ్యులర్ ఆడియన్స్ సినిమా ఎప్పుడు అయిపోతుంది సామి అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. 118 లాంటి డిఫెరెంట్ మూవీ తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఇలాంటి స్టొరీ ఎలా ఒప్పుకున్నాడో తెలియదు.

బహుశా కథ పాయింట్ నచ్చి ఉండొచ్చు కానీ డైరెక్టర్ సినిమా ను తెరకెక్కించిన విధానం చూస్తె ఇతనేనా శతమానం భవతి తీసింది అనిపిస్తుంది. మరో శ్రీనివాస కళ్యాణం లాంటి టేకింగ్ తో బ్రహ్మోత్సవం సినిమాను మరిపించే సినిమానే ఎంత మంచి వాడవురా…

ఓవరాల్ గా సినిమా జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉంటుంది, సినిమా మా రేటింగ్ [2.25 స్టార్స్]… ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ముందు చెప్పిన 2 సినిమాల మాదిరి సినిమాలు చూడాలి అనుకుంటే ఈ సినిమా కి వెళ్ళొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here