2019 ఇయర్ టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి, తొలి 3 నెలల్లో ఒకటి రెండు సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డవే, కాగా ఉన్నంతలో ఆకట్టుకున్న సినిమాలు కొన్నే అయినా ప్రతీ ఇయర్ ఓవర్సీస్ లో మాత్రం తెలుగు సినిమాలు మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునేవి, కానీ ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క f2 తప్పితే మిగిలిన సినిమాల్లో…
పండగ సెలవుల అడ్వాంటేజ్ తో ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రమె 0.8 మిలియన్ మార్క్ ని అందుకుంది, కానీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు ఆల్ టైం డిసాస్టర్ రేంజ్ లో కేవలం 0.22 మిలియన్ మార్క్ నే అందుకోగా సంక్రాంతి బిగ్గెస్ట్ మూవీ అనుకున్న…
వినయ విధేయ రామ స్టార్ హీరోల సినిమాల్లో అత్యల్ప కలెక్షన్స్ ని అందుకుంది, కేవలం 0.24 మిలియన్ మార్క్ ని మాత్రమె అందుకోగా తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను కానీ యాత్ర కానీ కేవలం 2 లక్షల డాలర్స్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని మాత్రమె రాబట్ట గలిగాయి.
ఇదే సమయం లో లేట్ గా ఎంటర్ అయిన రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఓవర్సీస్ దగ్గర కేవలం 0.2 మిలియన్ టార్గెట్ తోనే బరిలోకి దిగి ఇప్పటి వరకు అక్కడ 0.26 మిలియన్ మార్క్ ని అందుకుని ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో…
ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు అందుకున్న మూడో సినిమాగా నిలిచింది, ఎన్టీఆర్ మహానాయకుడు, వినయ విధేయ రామ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ ని దాటేసి వసూళ్లు దక్కించు కుంది, ఇక్కడ రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సూపర్ అని తేల్చేశారు ట్రేడ్ వర్గాలు.