ఈ శుక్ర వారం ఆడియన్స్ ముందుకు రెండు కొత్త సినిమాలు పోటి పడబోతున్నాయ్… ఒకటి కంప్లీట్ గా యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కించిన మూవీ రొమాంటిక్ కాగా మరోటి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తెరకెక్కించిన వరుడు కావలెను సినిమాలు… రెండు సినిమాలు రీసెంట్ గా సెన్సార్ లను పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్ధం అవ్వగా రెండు సినిమాలు కూడా అటూ ఇటూగా రెండు గంటల 13 నిమిషాల లెంత్ తో….
ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాల టోటల్ బిజినెస్ డీటైల్స్ ఇంకా కంప్లీట్ గా రిలీజ్ అవ్వాల్సి ఉండగా రెండు సినిమాల కోస్టల్ ఆంద్ర బిజినెస్ లెక్కలు బయటికి వచ్చాయి… ముందుకు అనుకున్న బిజినెస్ లు రెండు సినిమాలకూ…
అటూ ఇటూగా 3-4 కోట్లకు పైగానే జరిగినప్పటికీ టికెట్ రేట్లు ఇంకా సెట్ కాక పోవడం, ఇప్పట్లో సెట్ అయ్యేలా కూడా లేక పోవడం తో బయర్స్ బిజినెస్ ను తగ్గించుకోమని రిక్వెస్ట్ చేయడం తో ఈ రెండు సినిమాల బిజినెస్ లు తగ్గాయని తెలుస్తుంది. రొమాంటిక్ సినిమా కన్నా బడ్జెట్ లో వరుణ్ కావలెను కొంచం పెద్ద సినిమానే అయినా…
ప్రజెంట్ పరిస్థితుల దృశ్యా 2.5 కోట్ల రేంజ్ రేటు కి ఓవరాల్ గా 6 ఏరియాల కోస్టల్ ఆంద్ర బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఇక వరుడు కావలెను తో పోల్చితే చిన్న సినిమానే అయినా యూత్ సబ్జెక్ట్ అవ్వడం తో రొమాంటిక్ సినిమా కి కూడా 2 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక నైజాం మరియు సీడెడ్…
లాంటి ఇతర మేజర్ ఏరియాల బిజినెస్ వివరాలు రిలీజ్ కి ముందు కన్ఫాం కాబోతున్నాయి. ఓవరాల్ గా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అద్బుతం కాదు కానీ డీసెంట్ గా బిజినెస్ లను సొంతం చేసుకోబోతున్నాయి. కానీ ఆంధ్రలో టికెట్ రేట్ల వలన ముందు అనుకున్న బిజినెస్ లు కన్నా ఇప్పుడు రేట్లు భారీగా తగ్గడం జరిగింది. ఇలానే టికెట్ రేట్లు సెట్ అయ్యే దాకా ఇతర సినిమాలకు కూడా జరగడం ఖాయమని చెప్పాలి…