కాగా ఎట్టకేలకు యూనిట్ ఈ నెల 14 న అఫీషియల్ ప్రెస్ మీట్ లో సినిమా గురించిన వివరాలను రివీల్ చేస్తున్నారనే టాక్ వచ్చినా కానీ అది రూమర్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు, కానీ ఇప్పుడు అవే నిజం అయ్యా యని చెప్పొచ్చు.
సినిమా యూనిట్ నుండి అఫీషియల్ గా ఈ నెల 14 న హైదరాబాదు లో జరిగే ప్రెస్ మీట్ లో సినిమా గురించిన కొన్ని విశేషాలను ప్రెస్ మీడియా తో పంచుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరి దృష్టి ఇప్పుడు ఈ ఈవెంట్ వైపు మళ్ళింది అని చెప్పొచ్చు.
కాగా ఈ ఈవెంట్ లోనే సినిమా లో నటించ బోయే హీరోయిన్స్ వివరాలను తర్వాత టైటిల్ అనౌన్స్ మెంట్ ను ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ని తెలియ జేస్తారని అంటున్నారు, దాంతో సోషల్ మీడియా లో గుసగుసలు ఇప్పటి నుండే ఎక్కువ అయ్యాయి అని చెప్పాలి.
ఇందులో హీరోయిన్స్ గా ఆలియా భట్ మరియు పరిణితి చోప్రాలు, సినిమా టైటిల్ ఆల్ మోస్ట్ రామ రావణ రాజ్యం అని ఫైనల్ గా ఫస్ట్ లుక్ ని ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇవి ఎంతవరకు నిజం అవుతాయో రెండు రోజుల్లో తెలియనుంది.