బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ నెల ఎండ్ నుండి సమ్మర్ సీజన్ స్టార్ట్ కాబోతూ ఉండగా మధ్యలో కొత్త సినిమాలు వస్తూ ఉన్నప్పటికీ ఆడియన్స్ ను పూర్తిగా సాటిస్ ఫై చేసేలా ఒకటి అరా సినిమాలే వస్తూ ఉండగా ఈ గ్యాప్ లో కొన్ని ఓల్డ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తూ ఉండగా… ఆల్ రెడీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా..
రీ రిలీజ్ లో సంచలనం సృష్టించగా…ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie) ఈ వీకెండ్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర టైం మాత్రమే అవుతూ ఉండగా…
ఆడియన్స్ లో డిజిటల్ రిలీజ్ తర్వాత నుండి సాలిడ్ గా క్రేజ్ ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఎదో ఒక ఎలివేషన్ తో ట్రెండ్ అయ్యే సలార్ మూవీ ని ఈ శుక్రవారం గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తూ ఉండగా…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను…
ఆల్ రెడీ ఓపెన్ చేసి మూడు రోజులు కావోస్తూ ఉండగా…ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ తో సలార్ రీ రిలీజ్ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి… ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా కి 65 వేలకు పైగా టికెట్ సేల్స్ ఆన్ లైన్ లో జరిగాయి…
ఇంకా రిలీజ్ కి నాలుగు రోజుల టైం ఉండటంతో అప్పటి వరకు టికెట్ సేల్స్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా…రిలీజ్ టైంకి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సలార్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా… ఇక ఇప్పటి వరకు జరిగిన..
బుకింగ్స్ తోనే సినిమా 75 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇప్పుడు.