ఈ శుక్ర వారం ఆడియన్స్ ముందుకు కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా వాటితో పాటు తమిళ్ అండ్ తెలుగు లో ఆడియన్స్ ముందుకు విశాల్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ సామాన్యుడు కూడా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. జనవరి 26నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఒక వారం గ్యాప్ తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా బజ్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి…
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం జనాలు సినిమాల మీద చాలా తక్కువ ఆసక్తి చూపుతూ ఉండగా దానికి తోడూ థార్డ్ వేవ్ కేసుల ఎఫెక్ట్ కూడా ఉందని చెప్పాలి. కానీ కేసులు తగ్గుతూ ఉండటంతో జనాలు తిరిగి థియేటర్స్ కి రప్పించే సినిమాలు కూడా ఇప్పుడు అవసరం….
ఆ కోవలోకే ఫిబ్రవరి లో కొన్ని మంచి సినిమా లు కూడా రిలీజ్ కానుండగా విశాల్ సామాన్యుడు కూడా ఆ హోప్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల లో ఓవరాల్ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తుంది….
ఓవరాల్ గా సినిమా బిజినెస్ ను గమనిస్తే…. నైజాంలో 2 కోట్లు, సీడెడ్ లో 70 లక్షలు, టోటల్ ఆంధ్ర రీజన్ లో 2.4 కోట్ల బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.1 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సామాన్యుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే….
తెలుగు లో 5.5 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ టైం లో ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం కూడా గొప్ప విషయమే. మరి విశాల్ సామాన్యుడు సినిమాతో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రీసెంట్ ఫ్లాఫ్ మూవీస్ నుండి కంబ్యాక్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.